వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు ప్రతి అభిమాని కృషి చేయాలని వంగవీటి మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని పాల్తేరు గ్రామంలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రంగా సమాజంలో బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మిత్రమండలి నేతలు చిక్కాల రామారావు, గెడ్డం బుజ్జి, తోట నగేష్, దేవవరపు రాజబాబు, జగతా శ్రీను పాల్గొన్నారు.