విశాఖలో వైకాపా నేతల భూ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కోయ ప్రసాద్‌రెడ్డి అనే చిన్న చేప వెనుక ఉన్న తిమింగలాలను బయటపెట్టేందుకు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరుడైన ప్రసాద్ రెడ్డి విశాఖలో 100 ఎకరాల కబ్జాకు ప్రయత్నించారని.. సీఎం జగన్, ఎంపీల ప్రోద్బలంతోనే వైకాపా నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వైఖరికి వైజాగ్ ప్రజలు భయాందోళనలో ఉన్నారని అనిత అన్నారు.
'భూ కుంభకోణాలపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించండి' - విశాఖ భూ కుంభకోణాలపై అనిత వ్యాఖ్యల వార్తలు
విశాఖలో జరుగుతున్న అధికార పార్టీ నాయకుల భూ కుంభకోణాలపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల వైఖరికి వైజాగ్ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు.
వంగలపూడి అనిత