సంక్రాంతి కానుక.. 15న కూతపెట్టనున్న వందే భారత్ రైలు - వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు వేగం
22:09 January 11
వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Vande Bharat express: సికింద్రాబాద్- విశాఖపట్నం మద్య నడవనున్న వందేభారత్ రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్ మారింది. ఈనెల 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందే భారత్ రైలును మోదీ ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. కానీ, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడటంతో రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్ కూడా మారింది. ఈనెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
రాళ్లు విసిరిన ఆకతాయిలు:వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరిన ఘటన విశాఖలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌కు ఈరైలును రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్‌కు ట్రైన్ వెళ్తుండగా.. కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: