లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు వానప్రస్థం వృద్ధాశ్రమం సంస్థ ఆహారం పంపిణీ చేస్తోంది. రోజుకు ఓ వెయ్యి మందికి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆదేశాలతో ఈ సంస్థ భోజనం అందిస్తోంది. 11 రోజుల నుంచి వీరు ఈ సేవలను నిర్వహిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెల్టర్ జోన్స్లో ఆహారం అందజేస్తున్నారు.
విశాఖలో వానప్రస్థం వృద్ధాశ్రమం సంస్థ సేవలు - lockdown in Visakha
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆకలిని తీర్చేందుకు పలు సంస్థలు శ్రమిస్తున్నాయి. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆదేశాలతో వానప్రస్థం వృద్ధాశ్రమం సంస్థ నిరాశ్రయులకు ఆహారం అందిస్తోంది.
విశాఖలో వానప్రస్థం వృద్ధాశ్రమం సంస్థ సేవలు