విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు రాజాపురం మలుపు వద్ద.. అట్టల వ్యాన్... కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్నవారు.. సురక్షితంగా బయటపడ్డారు. మలుపు వద్ద ప్రమాదం జరగిన కారణంగా.. సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
కారుపై పడిన వ్యాన్.. ప్రయాణికులు సురక్షితం - కారుపై వ్యాన్ బోల్తా వార్తలు
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. అట్టల లోడుతో వెళ్తున్న వ్యాన్... కారుపై బోల్తా పడింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటం.. ఊరట కలిగించింది.
![కారుపై పడిన వ్యాన్.. ప్రయాణికులు సురక్షితం accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11189977-292-11189977-1616913944419.jpg)
కారుపై పడిన వ్యాన్