ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర పరిస్థితి మరింత దిగజారింది' - tdp meet on utharandhra development

విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో ఉత్తరాంధ్ర తెదేపా ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఉత్తరాంధ్రకు న్యాయం చేయకపోగా.. తీవ్ర అన్యాయం చేస్తుందని తెదేపా నేతలు ఆరోపించారు.

uttarandhra rakshana charvha vedika at vishakapatnam
uttarandhra rakshana charvha vedika at vishakapatnam

By

Published : Aug 30, 2021, 3:34 PM IST

జగన్ పాలనలో వెనకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితి మరింత దిగజారిపోయిందని తెలుగుదేశం పార్తీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ఒక్కరూపాయి ఖర్చు చేయలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 5,10 శాతం పనులు పూర్తిచేస్తే ఎన్నో రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఉత్తరాంధ్ర నేతలు కనీసం సీఎం జగన్‌ వద్దకు వెళ్లి అడిగే పరిస్థితులే లేవని అచ్చెన్న విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం ఉత్తరాంధ్రకు న్యాయం చేయకపోగా.. తీవ్ర అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కక్ష సాధింపు చర్యలతో వైకాపా ప్రభుత్వం నడుస్తోందని తెదేపా నేత నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ఉత్తరాంధ్రలో తెదేపా హయాంలో పరిశ్రమలు వస్తే.. వైకాపా ప్రభుత్వం వెళ్లగొట్టిందని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో తెదేపా అభివృద్ధి తెలియజేస్తూ బస్ యాత్ర చేస్తామని అన్నారు.

రాష్ట్రం ల్యాండ్, సాండ్​, మైన్... ఈ మూడు పాలసీలతో నడుస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దోచుకోవడం దాచుకోవడంలో జగన్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.

ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదిక

ఇదీ చదవండి :

CHANDRABABU : 'ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు'

ABOUT THE AUTHOR

...view details