మన్యంలో వినియోగించిన పీపీఈ కిట్ల కలకలం - మన్యంలో వినియోగించిన పిపిఇ కిట్ల కలకలం
వినియోగించిన మెడికల్ పీపీఈ కిట్లు విశాఖ జిల్లా చింతపల్లి మన్యం ప్రవేశ మార్గం డౌనూరు ప్రధాన రహదారి వద్ద తుప్పల్లో పడేయడం కలకలం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే మన్యంలో కరోనా కేసులు నమోదు అవుతుంటే ఇలాంటి చర్యలతో వైరస్ వ్యాప్తి చెందుతుందని ఏజెన్సీ వాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మన్యంలో వినియోగించిన పిపిఇ కిట్ల కలకలం
విశాఖ జిల్లా నర్సీపట్నం - చింతపల్లి మన్యం మార్గంలోని కొయ్యూరు మండలం డౌనూరు వద్ద ప్రధాన రహదారి పక్కన తుప్పల్లో కరోనా వైద్య సేవలో ఉపయోగించిన పీపీఈ కిట్లు పడేశారు. వాటిని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువకులు పెట్రోల్ పోసి వాటిని కాల్చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:గణాంకాలు సమగ్రంగా ఉంటే వైరస్ గమనాన్ని అంచనా వేయొచ్చు