ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భారత్-అమెరికా రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం' - US Ambassador Kenneth Juster news upadates

భారత్-అమెరికా రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని భారత్​లో అమెరికా అంబాసిడర్ కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు. భారత్-అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

గౌరవ వందనాలు చేస్తున్న ఇరు దేశాల అధికారులు

By

Published : Nov 15, 2019, 11:59 AM IST

Updated : Nov 15, 2019, 12:57 PM IST

తొలిసారిగా భారత్ - అమెరికా విపత్తు స్పందన మానవీయ సాయంపై ఏర్పాటైన సంయుక్త విన్యాసాలను అమెరికా అంబాసిడర్ కెన్నత్ జస్టర్ పరిశీలించారు. భారత్ తరఫున తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్వైస్ అడ్మిరల్ గోర్మడే.. కెన్నత్ జస్టర్​కి స్వాగతం పలికారు హైదరాబాద్ టాటా, లాకీలు సంయుక్త భాగస్వామ్యంలో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాల తయారీ, సీ130 విమానాల విడిభాగాల తయారీ మంచి పురోగతిలో ఉన్నాయన్నారు. టైగర్ ట్రంప్ -2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా, ఐఎన్ఎస్ జలాశ్వ్పై ఉభయ దళాలు మార్చ్ నిర్వహించాయి. ఈనెల 21వరకు విశాఖ, కాకినాడలలో ఈ విన్యాసాలు జరుగనున్నాయి. మిలటరీ సంబంధాలు, మానవీయ సాయం, విపత్తు స్పందన వంటి అంశాలలో చిన్న యూనిట్ నైపుణ్యాల అభివృద్ది కూడా ఇందులో భాగంగా ఉంటాయి. భారత్ - అమెరికా వాణిజ్య సదస్సులు డిసెంబర్ 18,19 లలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో జరిగే సదస్సులు ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. విపత్తు స్పందనలో భారత రక్షణ దళాలకు మంచి అనుభవం ఉందని... వీటిని అమెరికా సంబంధాలతో పరస్పరం పంచుకుంటామని తూర్పు నౌక దళ రియర్ ఆడ్మిరల్ సూరజ్ బెర్రీ వెల్లడించారు.

భారత్-అమెరికా రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది: కెన్నత్ జస్టర్
Last Updated : Nov 15, 2019, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details