హిందూ ముస్లింలు కలిసికట్టుగా జరుపుకునే ఉరుసు ఉత్సవం విశాఖ జిల్లా బయ్యవరంలో ఘనంగా నిర్వహించారు. మత గురువులు తీసుకువచ్చిన చందనంతో గుషల్ షరీప్ చందనం పూశారు. బాబా సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఫాతిమా ఖనితబురక్( చందనం పంపిణీ) నిర్వహించారు. రాత్రికి నిర్వహించిన ఖావ్వాలి పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేశారు.
విశాఖ జిల్లాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు - latest devotional news in visakha
హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిర్వహించిన హజరత్ ఆన్సర్ మద్ని ఔలియ 68వ ఉరుసు చందనోత్సవం ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో నిర్వహించిన ఊరుసు ఉత్సవంలో హిందు, ముస్లింలు ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ జిల్లా ఘనంగా జరిగిన ఉరుసు ఉత్సవాలు