విశాఖపట్నం జిల్లాలో కిరాణ వస్తువుల విక్రయాల్లో తప్పుడు విధానాలు పాటిస్తున్న వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఏడు నెలల్లో 2880 దుకాణాల్లో తనిఖీలు చేపట్టి 595 కేసులు నమోదు చేశారు. అత్యధిక అపరాధ రుసుం వీటి నుంచే వసూలు చేశారు. టోకువర్తక దుకాణాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
నెలలు | తనిఖీలు | కేసులు నమోదు |
ఏడు | 2880 | 595 |
- కొవిడ్ సమయంలో ధరల నియంత్రణ..
కరోనా సమయంలో ధరల నియంత్రణ ఉండటంతో తీవ్రంగా కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వ్యాపారులు సక్రమంగా తూకం వేయకపోవడం, అయిదు నుంచి పది రూపాయలు ఎక్కువ ధరకు విక్రయాలు సాగించారు.
- మోసం ఇలా..
మాంసం దుకాణానికి వెళ్తున్నారా..సరిగా తూకం వేస్తున్నారో లేదో పరీక్షగా చూడండి. చికెన్, మటన్ విక్రయదారులు కొందరు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తూనికలు కొలతలు శాఖ అధికారులు గుర్తించారు. కేజీకి 100-200 గ్రాములు తక్కువగా తూకం వేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. మటన్ విక్రయాల్లో నీళ్లు చల్లి అమ్మడం వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తేల్చారు.
- అలాంటివన్నీ పట్టుకున్నారు..
రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో ఎక్కువ మంది రైతులు అరిగిపోయిన తూనికరాళ్లు వినియోగించడం, పునరుద్ధరించని తూనిక యంత్రాలను వినియోగించడాన్ని పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ వస్తువుల విక్రయాల్లో ఎక్కువగా వాటి మీద ఉత్పత్తిదారుల చిరునామాలు లేకపోవడం, తయారీ తేదీ, ఎంఆర్‌పీ వంటి వివరాలు లేకపోవడాన్ని గుర్తించి కేసులు పెట్టారు.
ఏప్రిల్ - అక్టోబరు మధ్య నమోదు చేసిన కేసులు | 1627 |
తూనికల్లో గుర్తించిన మోసాలు | 726 |
ప్యాకేజీ నిబంధనలు పాటించని వారిపై | 901 |
మొత్తం కేసులపై వసూలైన అపరాధ రుసుం | రూ.65 లక్షలు |
తూనిక యంత్రాల ముద్రణపై వచ్చిన రుసుం | రూ.1.39 కోట్లు |
ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య నమోదైన కేసుల వివరాలు ఇలా :
వ్యాపారం నమోదు చేసిన కేసులు అపరాధ రుసుం (రూ.లలో)
కిరాణ దుకాణాలు | 5,95 18,89,700 |
టోకు వర్తకులు | 2,09 8,02,500 |
మాంసపు విక్రయశాలలు | 1,23 1,42,650 |
బియ్యం దుకాణాలు | 3,1 1,68,500 |
రైతుబజారు, మార్కెట్లు | 81, 51,700 |
ఎలక్ట్రికల్ వస్తువులు | 7,1 3,17,500 |
మిఠాయి విక్రయాలు | 5,0 2,57,500 |
మొబైల్ వ్యాపారులు | 09, 55000 |
క్రిమిసంహారక మందులు | 02 1,10,000 |
- అక్టోబరులో..