ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ మసాలా దినుసులకు.... 4 జిల్లాల ప్రజలు ఫిదా! - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ జిల్లాలోని ఉపమాకలో దొరికే మసాలా దినుసులకు గిరాకీ మామూలుగా ఉండదు. వీటి రుచికి నాలుగు జిల్లాల ప్రజలు ఫిదా అయిపోయారు. ఏడాదికి సరిపడే మసాలా దినుసులను ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.

upamaka masala dinusulu
upamaka masala dinusulu

By

Published : Mar 19, 2020, 7:33 AM IST

ఆ మసాల దినుసులకు....4 జిల్లాల ప్రజలు ఫిదా!

విశాఖ జిల్లాలోని విలక్షణ క్షేత్రం ఉపమాక. కల్కి అవతార తత్వం, శ్రీవేంకటేశ్వర స్వామి విశేషం కలగలిసిన దివ్యసన్నిధి. ఇక్కడ ఏటా జరిగే వార్షికోత్సవాల్లో వెంకన్న కల్యాణోత్సవానికి ప్రత్యేకత ఉంది. కల్యాణంతో ప్రారంభమయ్యే తీర్థం...ఉపమాకలో పండుగ వాతావరణాన్నితీసుకొస్తుంది. ఈ సమయంలో ఇక్కడ నిర్వహించే మసాలా దినుసుల మార్కెట్‌కు ప్రత్యేకత ఉంది. ఈ మార్కెట్ అంటే.. చుట్టు పక్కల నాలుగు జిల్లాల ప్రజలకు ఎంతో ఆసక్తి. ఒక ఏడాదికి సరిపడే మసాలా దినుసులను ఇక్కడినుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తారంటే వీటికి ఏ స్థాయిలో గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాటాకులతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడారాల్లో లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఎన్నో రకాల దినుసులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దేవుని దర్శనం కోసం వచ్చే భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు మసాలా దినుసులను వెంట తీసుకెళ్లడం పరిపాటి. ఇక్కడ విక్రయించే మసాలా దినుసుల్లో నాణ్యత బాగుంటుందని.... సంవత్సరం పాటు దాచినా పాడవవు అని వినియోగదారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details