ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనధికారికంగా 50 మంది కార్మికుల ఆత్మహత్య: పవన్ - రాష్ట్రంలో ఇసుక సమస్యలు

తమను తిట్టటం వల్ల కార్మికుల సమస్య తీరుతుందా అని వైకాపా నేతలను జనసేన అధినేత ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. కార్మికుల సమస్యపైనే తమ పోరాటమని స్పష్టం చేశారు.

పవన్

By

Published : Nov 4, 2019, 9:32 PM IST

మీడియా సమావేశంలో పవన్ ప్రసంగం

రాష్ట్ర మంత్రులు జనసేనపై విమర్శలు మాని ఇసుక కొరతపై దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తమను దూషించడం వల్ల కార్మికుల సమస్య తీరుతుందా అని వైకాపా సర్కార్​ని ప్రశ్నించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు 5 నెలలుగా ఇబ్బంది పడుతున్నారన్న పవన్... అనధికారికంగా ఇప్పటివరకు 50 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిచేయాలే కానీ... అన్నీ ఆపేస్తామంటే కార్మికుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయని... ఎక్కడా లేని ఇసుక సమస్య మన రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్మికుల తరపున ఒక్క సీటు ఉన్న జనసేన పోరాడుతోందని స్పష్టం చేశారు. లక్షలమంది కార్మికుల భవిష్యత్తు కోసం అందరూ సహకరించాలని కోరారు. 2 వారాల్లోగా సమస్యను పరిష్కరించకపోతే.. తదుపరి ప్రణాళిక ప్రకటిస్తామని జనసేనాని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details