విశాఖ జిల్లా గాజువాకలో పోలీసులు గుర్తు తెలియని మృతదేహన్ని గుర్తించారు. గుడివాడ అప్పన్న కాలనీకి వెళ్లే మార్గంలో మహిళ మృత దేహం లభ్యమైంది. రహదారి నుంచి సుమారు అర కిలోమీటరు దూరంలో తుప్పల్లో మృత దేహం కనిపించింది. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహన్ని గత నాలుగు రోజుల క్రితం ఓ యువకుడు చూసినట్లు తెలుస్తోంది.
గాజువాకలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం ! - గాజువాకలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
పూర్తిగా కాలినస్థితిలో ఉన్న గుర్తు తెలియన మృతదేహని విశాఖ జిల్లా గాజువాకలో పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం మహిళను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
గాజువాకలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం !
ఫిర్యాదు చేయడానికి ఆ యువకుడు భయపడ్డాడని...,చివరికి పోలీసులకు సమాచారం చేరడంతో ఆదివారం రాత్రి ఆ ప్రాంతంలో వెతకటం ప్రారంభించారు. ఓ కాలువలో మృతదేహం పడి ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా లారీ డ్రైవర్లు, మద్యం సేవించే వ్యక్తులు తిరుగుతూ ఉంటారని స్థానికులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం మహిళను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి సినీఫక్కిలో భారీగా గంజాయి పట్టివేత