ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుండగుల దాడిలో.. వ్యక్తి మృతి - latest news in vishaka

విశాఖ బీచ్ రోడ్​లో ఓ వ్యక్తి పై దుండగులు దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని కేజీహెచ్​కి తరలిస్తుండగా మృతి చెందాడు.

Attack with knives
కత్తితో దాడి

By

Published : Jul 5, 2021, 10:51 PM IST

విశాఖ బీచ్ రోడ్ ప్రతిమ ప్యారడైజ్ అపార్ట్ మెంట్ వద్ద ఓ వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆ వ్యక్తిని కేజీహెచ్​కి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మృతుడు పశ్చిమగోదావరి ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. అతడు కొంతకాలంగా బీచ్ రోడ్​లోని అపార్ట్ మెంట్​లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details