ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ - United Forum of Dalit Associations at visakhapatnam district news

కరోనాతో బాధపడుతూ మృతి చెందిన స్టేట్ బ్యాంకు మేనేజర్ పిట్టా రాజేష్​ని వేధింపులకు గురి చేసి, ఆయన మరణానికి కారణమైన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కరోనా నివేదిక సమర్పించినప్పటికిీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విశాఖ అంబేద్కర్ భవన్ లో నిరసన తెలిపారు.

United Forum of Dalit Associations
దళిత సంఘాల ఐక్యవేదిక

By

Published : Sep 22, 2020, 4:48 PM IST

కరోనాకు గురైన స్టేట్ బ్యాంకు మేనేజర్ పిట్టా రాజేష్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అరకు మండలం లక్ష్మీపురం స్టేట్ బ్యాంక్ మేనేజర్​గా పని చేసే రాజేష్.. ఆగస్టు 29న ఆసుపత్రికి వెళ్లే నిమిత్తం, పై అధికారులను సెలవు కోరాడని, కానీ వారు సెలవు నిరాకరించారని దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు వివరించారు. సెలవు కోసం విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని పూర్తి చేయకుండా వెళ్లరాదని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ డి. లలిత, హెచ్ఆర్ మేనేజర్ ఠాకూర్ హుకుం జారీ చేశారన్నారు.

మృతి చెందిన రాజేష్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐక్య వేదిక సహ కన్వీనర్లు కొత్తపల్లి వెంకటరమణ, చింతాడ సూర్యం, జి. రాంబాబు, బోని కృష్ణ, ఆర్.పి. రాజు, పట్టా రమేష్, పి. సుధాకర్, ఐడి బాబు, ఎం. డి. రాజు, జి. అప్పారావు, సుజాత కోటేశ్వరరావు జి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

చీటీల పేరుతో పోస్టుమ్యాన్ టోకరా.. రూ.1.5 కోట్లతో పరారీ

ABOUT THE AUTHOR

...view details