బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సమ్మె - banks bundh news in telugu
బ్యాంకింగ్ రంగంలో కేంద్రం చేపట్టిన సంస్కణలు వ్యతిరేకిస్తూ రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సంఘాలన్నీ సమ్మెకు సిద్దమయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో బ్యాంకుల సమ్మె... ఆర్థిక కార్యకలాపాలపైనా, ప్రభుత్వ ఆదాయంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయమై కేంద్రం దిగిరాకపోతే మాత్రం నిరవధిక సమ్మెకు సిద్దంగా ఉన్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పేర్కొంది.
రెండు రోజుల పాటు సమ్మెకు సిద్దమైన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు