ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమిలి బీచ్​లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - భీమిలి బీచ్​లో గుర్తుతెలియని మృతదేహం

భీమిలి బీచ్​కు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. కేవలం అస్తిపంజరం మాత్రమే మిగిలింది. మృతదేహాన్ని పోలీసులు శవపరీక్షకు పంపించారు.

Unidentified body
Unidentified body

By

Published : Sep 3, 2020, 8:16 PM IST

విశాఖ జిల్లా భీమిలి బీచ్​లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. బీచ్ రోడ్డు జగ్గారావు తోట దగ్గరలో మృతదేహం తీరానికి చేరింది. కేవలం అస్తిపంజరం మాత్రమే ఉన్న మృతదేహం నీటిలో తేలియాడుతుండటం గమనించిన స్థానికులు ఒడ్డుకు చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న భీమిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి, కేవలం అస్తిపంజరం మాత్రమే మిగిలి ఉందని, మెడలో మాస్కు, నడుంకి నల్లటి తాడు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహం ఆడా..? మగా..? చనిపోయి ఎన్ని రోజులు అయ్యింది..? హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే సందేహాలు పోస్ట్ మార్టంలో తేలాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details