ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ బతుకులు మాకొద్దు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర నిరుద్యోగుల లేఖ..! - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిరుద్యోగుల లేఖ

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని కొందరు నిరుద్యోగులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశ తమకు లేదని... కుటుంబాలకు, తల్లిదండ్రులకు భారం కాలేక పోతున్నామని ఆవేదన చెందారు. కాబట్టి తమకు చనిపోయేందుకు అవకాశం కల్పించాలని లేఖ ద్వారా జస్టిస్‌ ఎన్‌వీ రమణను కోరారు. ఆ లేఖను విశాఖలో మీడియాకు విడుదల చేశారు.

unemployment
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిరుద్యోగుల లేఖ

By

Published : Jul 21, 2021, 8:07 AM IST

విశాఖపట్నం ఎం.వి.పి.కాలనీకి చెందిన కొంతమంది నిరుద్యోగులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్‌ నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నామని.. ఈ ఉద్యోగ క్యాలెండర్‌ చాలా నిరుత్సహనికి గురి చేసిందని లేఖలో రాశారు.

సరైన ఉద్యోగాలు లేక, సమాజంలో తలెత్తుకోలేక, తల్లిదండ్రులకు భారం కాలేక, వారిని పోషించలేని జీవితం వ్యర్థం అనిపిస్తోందని, అందువల్ల తమకు కారుణ్య మరణాలకు అవకాశం కల్పించాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణను లేఖ ద్వారా కోరారు. 'నిరుద్యోగ యువత’ అనే పేరుతో లేఖను విడుదల చేశారు. లక్ష్మీనర్సింహ, సురేష్‌, చక్రి తదితర నిరుద్యోగులు ఈ లేఖ రాసినట్లు దానిపై సంతకాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details