ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగుబోతు అల్లుడిని హతమార్చిన మామ - దేవరాపల్లిలో ఆత్మహత్యల వార్తలు

మద్యానికి బానిసై కూతురుని ఇబ్బంది పెడుతున్న అల్లుడిని మామ ఇనుపరాడ్డుతో కొట్టి చంపేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తెనుగుపూడిలో జరిగింది.

uncle killed son in law at tenugupudi
అల్లుడిని చంపిన మామ

By

Published : Apr 23, 2020, 10:12 AM IST

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడిలో దారుణం జరిగింది. అల్లుడు తాగొచ్చి తన కూతురుని వేధింపులకు గురిచేస్తున్నాడని మామ ఆగ్రహించాడు. అల్లుడుని హతమార్చాడు. గ్రామానికి చెందిన దాసరి కృష్ణ... మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్య, పిల్లలను ఇబ్బంది పెట్టేవాడు. పలుమార్లు పోలీసులు, పెద్దలు మందలించినా.. కృష్ణ తీరు మారలేదు. కుటుంబ పోషణ భారంగా మారడం వల్ల భార్య వెంకటలక్ష్మి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగానే ఆటో నడపగా వచ్చిన డబ్బులతో కృష్ణ తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు.

వెంటనే వరలక్ష్మీ తన తండ్రి రాజుబాబుకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. పిల్లలతో సహా చనిపోవడమే దిక్కని కన్నీటిపర్యంతమైంది. మరుసటి రోజు గిరిజన గ్రామాల్లో కూరగాయలు విక్రయించడానికి కృష్ణ వెళ్లాడు. రోజూ లాగానే అమ్మగా వచ్చిన డబ్బులతో నాటుసారా తాగి... గ్రామ సమీపంలోని శారద నది వంతెనపై ఉన్నాడు. ఇదే అదునుగా... అర్ధరాత్రి సమయంలో వంతెనపై ఉన్న అల్లుడిని మామ ఇనుపరాడుతో కొట్టి చంపినట్లు చోడవరం సీఐ ఈశ్వరరావు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details