ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం - andhra cricket association
ఆంధ్ర క్రికెట్ సంఘం ఏసీఏ నూతన కార్యవర్గ పదవులకు పోటీ లేనందున ఏన్నికను ఏకగ్రీవంగా ఖరారు చేశారు. ఈ నెల 23న అధికారికంగా ఫలితం ప్రకటించనున్నారు.
ఆంధ్ర క్రికెట్ సంఘం ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికారికంగా ఈనెల 23న ఫలితం ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 6 పదవులకు గానూ.... ఆరుగురి నుంచి 9 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం... పదవులకు పోటీ లేనందున ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఖరారు చేశారు. ఏసీఏ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్‌కు చెందిన శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా యాచేంద్ర ఎన్నికయ్యారు.
కార్యదర్శిగా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా విజయవాడ వెల్కమ్ క్రికెట్ క్లబ్‌కు చెందిన రామచంద్రరరావు ఖరారయ్యారు. కోశాధికారిగా గుంటూరు న్యూ క్రికెట్ క్లబ్‌కు చెందిన గోపిననాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌గా గుంటూరు గోపరాజు ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ క్లబ్‌కు చెందిన ధనుంజయరెడ్డి ఎన్నికయ్యారు.