ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాఖీ రోజు విషాదం.. అక్క మరణాన్ని తట్టుకో లేక తమ్ముడు మృతి.. - Anakapalli latest news

అక్కంటే పంచప్రాణాలు ఆ తమ్ముడికి. తల్లిలా లాలించే అక్క మీద మమకారంతో పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తన కుటుంబంగా భావించి.. వారితో ఉండిపోయాడు. చివరకు అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి రోజే వారిద్దరు తనువు చాలించారు. అనారోగ్యంతో అక్క మృతి చెందటంతో... తట్టుకొలేకపోయిన ఆ తమ్ముడు గుండెపోటుతో మరణించాడు.

brother and sister died
అక్క మరణాన్ని తట్టుకొలేక తమ్ముడు మృతి

By

Published : Aug 23, 2021, 3:38 PM IST

అక్క అంటే ఆ తమ్ముడికి ఎనలేని మమకారం. పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తనదిగా భావించి.. నిరంతరం వారి ఉన్నతి కోసం తపన పడేవాడు. చివరికి రాఖీ పండుగ రోజే అక్క అనారోగ్యంతో మృతి చెందటంతో.. తట్టుకోలేక తమ్ముడు కూడా గుండెపోటుతో మరణించాడు. విశాఖ జిల్లా అనకాపల్లి శారదా కాలనీకి చెందిన లోలలితాదేవి.. కుమారై పద్మినీ రాణితో పాటు ఆమె తమ్ముడు ఎన్​ఆర్​ఎస్​ రామచంద్రరాజు కలిసి నివసిస్తున్నారు. నిన్న లలితా దేవి(84)అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వచ్చాక రామచంద్రరాజు(76) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాసేపటికి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. రాఖీ పౌర్ణమి నాడు.. ఆ అక్క,తమ్ముల మరణం చూపరులను కంటతడి పెట్టించింది.

ABOUT THE AUTHOR

...view details