మద్యానికి అలవాటు పడ్డ భర్త నిరంతరం వేధించటం.... అత్త, మామ వత్తాసు పలకడంపై.. మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సమీపంలోని కృష్ణాపురం కాలనీలో జరిగింది.
అగనంపూడిలోని ఉప్పర్ల కాలనీకి చెందిన ధనలక్ష్మి(23)ని కృష్ణాపురం కాలనీకి చెందిన గోవింద....2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. గోవిందు గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండడంపై... విసుగు చెందిన ధనలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూరి అప్పారావు తన కుమార్తె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.