పాడుబడిన వ్యాన్లో గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. విశాఖ జిల్లా అనకాపల్లి పూడిమడక రోడ్డులోని ఒక ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న వ్యాన్లో 35 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు అనకాపల్లి పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
సదరు వ్యక్తి మృతి చెంది 3 నుంచి 5 రోజుల గడిచి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.