కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఒకటైన సామాజిక దూరాన్ని పాటించడానికి విశాఖకు చెందిన వైద్యుడు కూటికుప్పల సూర్యారావు గొడుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కూరగాయలు, సరకుల కొనుగోలు, ఇతరత్రా సమయాల్లో బయటకు వెళ్లినపుడు సామాజిక దూరం పాటించడానికి గొడుగు సిద్ధాంతం ఉపకరిస్తుందని సూచించారు. గొడుగు పట్టుకుని వెళ్లడం సామాజిక దూరం పాటించేందుకు ఒక సాధనంగా ఉపకరిస్తుందని వివరించారు.
సామాజిక దూరానికి గొడుగు సిద్ధాంతం
కరోనా ఎఫెక్ట్‌తో సామాజిక దూరం పాటించాలని పలువురు అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. విశాఖకు చెందిన వైద్యుడు గొడుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
umbrella-principle