VISAKHA STEEL PLANT PRIVATIZATION : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని రాజకీయ వర్గాలు, ప్రజలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 30న ఉక్కు మహా గర్జన సభకు.. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతివ్వాలని.. పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ఈ నెల 30న "ఉక్కు మహా గర్జన సభ"
VISAKHA STEEL PLANT PRIVATIZATION: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 30న ఉక్కు మహా గర్జన సభకు.. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతివ్వాలని.. పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది.
VISAKHA STEEL PLANT PRIVATIZATION
సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహంపై రౌండ్ టేబుల్ సమావేశంలో.. కమిటీ నేతలు చర్చించారు. మహాగర్జనలో అన్ని పార్టీల నేతల సమక్షంలో పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని తీర్మానం చేసి.. దానిని ప్రధాని మోదీకి పంపిస్తామని చెప్పారు. అప్పటికీ వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: