ఉద్యోగ భద్రత కల్పించాలని అర్బన్ హెల్త్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో... సిబ్బందిని యథాతథంగా కొనసాగించాలన్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.
సమస్యలు పరిష్కరించాలి..
ఒప్పంద ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 'రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది ఈ ఆర్యోగ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కారణంగా మా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారాయని ఒప్పంద సిబ్బంది' పేర్కొంది.