ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగుండడం శుభసూచకం' - విశాఖ శారదాపీఠం వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండడం శుభసూచకమని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ అన్నారు. రెండు రాష్ట్రాలకు మాత్రం గ్రహాల అనుకూలతలు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. విశాఖ శారదాపీఠంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.

swarupananda swamy
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ

By

Published : Apr 13, 2021, 11:06 PM IST

శారదా పీఠంలో ఉగాది వేడుకలు

తెలుగు రాష్ట్రాలకు గ్రహాల అనుకూలత తక్కువగానే ఉన్నా, ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ జాతకాలు బాగుండటం ప్లవ నామ సంవత్సరంలో శుభ పరిణామమని అన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ. సేనాధిపతి కుజుడు కావడంతో ఈ ఏడాది దేశానికి యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం అనంతరం స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఆర్ధికంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ప్లవ అంటే వెలుగునిచ్చేదని అర్ధమని వివరించారు. వికారి, శార్వరి నామ సంవత్సరాలలో కమ్ముకున్న చీకట్లను తొలగించి ప్లవ నామ నూతన సంవత్సరం వెలుగులివ్వాలని కోరుతూ అంతా రాజశ్యామల అమ్మవారిని ప్రార్థించాలని స్వరూపానందేంద్ర సూచించారు.

విశాఖ శారదాపీఠం గంటల పంచాంగం ఆవిష్కరణ

శారదాపీఠంలో వేద పఠనంతో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించి ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వర్ణ కవచ ధారిణిగా దర్శనమిచ్చిన శారదాంబకు విశేష అర్చన నిర్వహించారు. అనంతరం వసంత రాత్రులను పురస్కరించుకుని సీతారాముల సమక్షంలో ఉగాది ఆస్థానానికి హాజరయ్యారు. విశాఖ శ్రీ శారదాపీఠం వారి గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆవిష్కరించారు. పీఠం ఆస్థాన సిద్ధాంతి పంతుల రామలింగ స్వామి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు.

ఇదీ చదవండి: విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details