విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నను ఉడిపి పెషావర్ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. స్వాగతం పలికిన ఆలయాధికారులు.. స్వామీజీ పేరున ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని పీఠాధిపతి అన్నారు. రామతీర్థం ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఉడిపి పెషావర్ పీఠాధిపతి - udipi peetadipati news
కర్ణాటకలోని ఉడిపి పెషావర్ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఉడిపి పెషావర్ పీఠాధిపతి
దేవాలయాలు, దేవుళ్లను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఈ సంఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శిస్తామని.. రాష్ట్రంలో అన్నీ హిందు దేవాలయాలను పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:పాడేరును కమ్మేసిన పొగమంచు