ప్రాథమిక హక్కులను కాలరాసే ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ పార్కులో ప్రజా పౌర సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఉపా చట్టం పేరుతో అన్యాయాన్ని ఎదిరించిన వారిపై, కుట్రలను బయట పెట్టేవారిపై అరెస్ట్ చేయటం దారుణమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఉపా’ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి' - ‘ఉపా’ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి
ప్రజల కోసం పని చేస్తున్న వారిని ‘ఉపా’ చట్టం పేరుతో అరెస్టులు చేయడం దారుణమని.. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజా పౌర సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఉపా చట్టం పేరుతో అరెస్ట్ చేసిన మేధావులు, కవులు, కళాకారులను వెంటనే విడుదల చేయాలన్నారు.
‘ఉపా’ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి'
ఈ చట్టం వల్ల పౌర హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని మండిపడ్డారు.ఉపా చట్టం పేరుతో అరెస్ట్ చేసిన మేధావులు, కవులు, కళాకారులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.