ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Court Jobs: తుప్పు పట్టిన టైప్​ మిషన్లతో పరీక్షలా.. కోర్టు ఉద్యోగ అభ్యర్థుల అందోళన - court jobs 2023

AP Court Jobs 2023 : హైకోర్టు, జిల్లా కోర్టుల్లోని టైపిస్టు ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన టైపింగ్​ స్పీడ్​ పరీక్షలో అభ్యర్థులకు అనుకోని ఘటన ఎదురైంది. ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి సన్నద్ధమై.. కొలువు సాధించాలని బండేడు ఆశతో పరీక్షకు హాజరుకాగా వారికి నిరాశే ఎదురైంది. అలా జరగటంతో అసలు ఉద్యోగమే సాధించలేమని ఉద్యోగార్థులు అంటున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 21, 2023, 7:59 PM IST

Type Machines Not Worked In Court Exam: తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ.. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో టైపిస్ట్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ధర్నా చేపట్టారు. విశాఖలోని అయాన్ డిజిటల్ జోన్ పరిక్షా కేంద్రం వద్ద దాదాపు 150 మంది అభ్యర్థులు ధర్నాకు దిగారు. పరీక్షా కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వారు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ఉద్యోగం సాధించాలనే తపనతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా.. వారికి ఏపీ హైకోర్టు ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్​ విడుదల చేసి తీపి కబురు అందిచ్చింది. జిల్లా కోర్టుల్లో, హైకోర్టు టైపిస్ట్ ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసి.. భర్తీ ప్రక్రియ చేపట్టింది. పరీక్షలను సైతం నిర్వహించింది. ఈ నోటిఫికేషన్​లోనైనా ఉద్యోగం సాధించాలనే కాంక్షతో నిరుద్యోగులు.. హైకోర్టు నిర్వహిస్తున్న ఉద్యోగ భర్తీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎంతో శ్రమించి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. రాత పరీక్షలైతే రాశారు కానీ, టైపింగ్​ కోసం నిర్వహించిన పరీక్షలో చిక్కులు ఎదురయ్యాయి.

టైపింగ్ స్పీడ్ టెస్టులో అవకాశం కోల్పోతామని నిరుద్యోగుల ఆవేదన

టైపిస్ట్ ఉద్యోగాలకు నిర్వహించిన టైపింగ్​ టెస్టులో తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. టైపిస్ట్ భర్తీకి నిర్వహించిన పరీక్షలో టైప్​ మిషన్లకు బోర్డు సరిగా పని చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు నిర్వహించిన ఈ పరీక్షలో దాదాపు.. ఐదు జిల్లాల నుంచి విశాఖ గాజువాక షీలానగర్‌లోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రానికి 150 మంది వరకు హాజరయ్యారు. ఈ పరీక్షలో వారికి కేటాయించిన టైప్​ మిషన్స్​ సరిగా పని చేయలేదని, కీ బోర్డు సరిగా కదలలేదని అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమకు తుప్పు పట్టిన టైప్​ మిషన్స్ కేటాయించారని ఆందోళన చేపట్టారు.

ఒక్క అక్షరం టైప్​ చేయటానికి ఒకసారి టైప్​ చేస్తే టైప్​ మిషన్లు పని చేయలేదని.. కనీసం నాలుగైదు సార్లు టైప్​ చేయాల్సి వచ్చిందని వాపోయారు. స్పీడ్​ కోసమే నిర్వహించిన పరీక్షలో టైప్​ మిషన్లు ఇలా మొరాయిస్తే టైపింగ్​లో స్పీడ్​ ఎలా వస్తుందని వారు ఆవేదన చెందారు. దీనివల్ల తమ స్పీడ్​ తగ్గిపోయి పరీక్షలో మెరిట్​ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేయని టైప్​ మిషన్లు కేటాయించటంపై.. పరీక్షా కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యమేనని అగ్రహం వ్త్యక్తం చేశారు. పరీక్షా కేంద్రం నిర్వహకులను ప్రశ్నించమని.. హైకోర్టుకు టైప్​ మిషన్లు పనిచేయటం లేదనే నిర్వహకులు తెలిపినట్లు వివరించారని అభ్యర్థులు పేర్కొన్నారు. టైపిస్టు పరీక్షలను మళ్లీ నిర్వహించి న్యాయం చేయాలని పరీక్షలకు హాజరైన అభ్యర్థులు డిమాండ్​ చేశారు. పరీక్షా కేంద్రం నిర్వాహకులు నిరుద్యోగుల జీవితాలతో అడుకున్నారని దుయ్యబట్టారు. టైప్​ మిషన్లు పనిచేయని కారణంగా కచ్చితంగా ఉద్యోగాలు సాధించలేమని అభ్యర్థులు అంటన్నారు.

"ఈ పరీక్షలో ప్రధాన పాత్ర కీ బోర్డుదే. అలాంటీ కీ బోర్డు అసలు బాలేదు. వాటిని మేమే శుభ్రం చేసుకుని పరీక్షలు రాశాము. ఒక్కసారి టైప్​ చేస్తే అసలు పని చేయలేదు. ఒక అక్షరం టైప్​ చేయటానికి మూడు నుంచి ఐదుసార్లు టైప్​ చేయాల్సి వచ్చింది." - పరీక్షలో పోటీ పడిన అభ్యర్థి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details