ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆటో... ఇద్దరు మృతి - విశాఖ జిల్లా సోమన్నపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా సోమన్న పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

road accindent
road accindent

By

Published : Oct 19, 2020, 10:37 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం సోమన్న పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎలమంచిలి నుంచి అడ్డ రోడ్డు వైపు వెళ్తున్న ఆటో ఎస్.రాయవరం మండలం పెద్ద గుమ్ములూరు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న నేతల ప్రసాద్(22) ముల్లంపాక ప్రభాస్ (18) తీవ్రంగా గాయపడ్డారు.

యువకులను విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులది ఎస్.రాయవరం మండలం పెద్ద కొండూరు గ్రామం. బలమైన గాయాలు తగలడం వల్ల యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details