విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలోని జాతీయ రహదారిపై కొక్కిరాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎలమంచిలి భూలోకమాంబ జాతర చూడటానికి వెళ్లిన వీరు ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తుండగా.. లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కసింకోట మండలం సోమవారం గ్రామానికి చెందిన తులసి రావు, పవన్ కుమార్ మృతి చెందారు. మిత్రులైన ఇద్దరు యువకులు బుల్లెట్ బండిపై ఎలమంచిలి జాతరకు వచ్చి అకాలంగా మృత్యువాతపడ్డారు. వీరి మృతదేహాలను ఎలమంచిలి మార్చురీకి తరలించారు. ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ACCIDENT: జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా... - నేర వార్తలు
విశాఖ జిల్లా ఎలమంచిలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎలమంచిలిలో జరుగుతున్న అమ్మవారి జాతరకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ACCIDENT