రాష్ట్రమంత్రివర్గ నిర్ణయంతో విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలు విడుదలకానున్నారు. ఐదేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 48 మందిని విడుదల చేస్తున్నారు. సర్కారు మార్గదర్శకాల ప్రకారం విడుదల ప్రక్రియ జరుగుతుందని జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
విశాఖ కేంద్ర కారాగారం నుంచి విడుదలకానున్న ఇద్దరు మహిళా ఖైదీలు
మంత్రివర్గ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల్లో కొంతమంది విడుదల కానున్నారు. విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరిని విడుదల చేస్తున్నారు.
విశాఖ కేంద్ర కారాగారం