అమాయక గిరిజనులను హత్యచేశారు : మృతుల బంధువులు - గిరిజనులు
పొట్ట కూటి కోసం వేటకు వెళ్లిన రైతులను పోలీసులు చంపేశారని మృతుల బంధువులు ఆరోపించారు. విశాఖ మన్యం కాల్పుల్లో మరణించిన ఇద్దరు వ్యక్తుల బంధువులు పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.
గిరిజనులు
విశాఖ మన్యం పెదకోడాపల్లి పంచాయతీ బురదమామిడిలో పోలీస్ కాల్పుల్లో మరణించిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. భూషణం, జమదర్ మృతదేహాలు శవపంచనామా కోసం పాడేరు ఆసుపత్రికి తరలించగా అక్కడకు చేరుకున్న బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయక గిరిజనులను హత్యచేశారని ఆవేదన చెందారు. అక్కడ నుంచి పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయంనకు ర్యాలీ వెళ్లి నిరసన వ్యక్తంచేశారు.