విశాఖ అక్కయ్యపాలెం పుట్టమన్ను బంగారమ్మ తల్లి ఆలయ సమీపంలో ఈనెల 23న జరిగిన దాడి ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అక్కయ్యపాలెం నందగిరి నగర్‌కు చెందిన పెద్దిశెట్టి రూపేశ్ 23న సాయంత్రం దొండపర్తి రామాలయం వీధి గుండా గీతా క్లబ్ వైపు వెళ్తుండగా రాఖీ అనే వ్యక్తితో స్వల్ప వివాదం జరిగింది.
హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు - హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు !
అక్కయ్యపాలెం పుట్టమన్ను బంగారమ్మ తల్లి ఆలయ సమీపంలో ఈనెల 23న ఓ వ్యక్తి హత్యకు యత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
![హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7778841-185-7778841-1593167090029.jpg)
హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు !
రాఖీ తన స్నేహితులైన మురళీ, మహేశ్, సతీశ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి రూపేశ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. దాడి నుంచి తప్పించుకున్న రూపేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.