విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. తెలంగాణ నుంచి శ్రీకాకుళంకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థులు... మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. వేగంతో ద్విచక్రవాహనం నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యలమంచిలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి - latest crime news in visakha
చేతికందొచ్చిన ఇద్దరు కుమారులు అతివేగం కారణంగా మృత్యువాత పడ్డారు. పిల్లలను పోగుట్టుకున్న ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలివి.
two students died in visakhapanam dst elamanchali