ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రైళ్ల సమాయాల్లో మార్పులు

తూర్పు కోస్తా రైల్వే ఈ నెల 18 నుంచి.. రెండు రైళ్లకు కొత్త వేళలను అమలు చేయనుంది. విశాఖ - రాయగడ్ ల మధ్య నడిచే డైలీ ప్రత్యేక రైలు, విశాఖ - పలాస ల మధ్య నడితే డైలీ ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది.

రెండు రైళ్ల సమాయాల్లో మార్పులు
రెండు రైళ్ల సమాయాల్లో మార్పులు

By

Published : Jan 17, 2021, 7:55 AM IST

తూర్పు కోస్తా రైల్వే ఈ నెల 18 నుంచి కొత్త రైల్వే వేళలను రెండు రైళ్లకు అమలు చేయనుంది. విశాఖ ‌- రాయ‌గ‌ఢ్​ మధ్య న‌డిచే డైలీ ప్ర‌త్యేక రైలు ఉదయం 5.40 నిమిషాలకు రాయగఢ్ నుంచి బయలు దేరి పది గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖలో సాయంత్రం ఆరుగంటలకు బయలుదేరి, రాత్రి పది గంటలకు రాయగఢ్ చేరుతుంది. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతివరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్ లలో ఈ రైలు ఆగుతుంది.

విశాఖ ప‌లాస‌ మ‌ధ్య న‌డిచే డైలీ స్పెష‌ల్ రైలు ప‌లాస‌లో ఉద‌యం ఐదు గంట‌ల‌కు బ‌య‌లు దేరి 9.25 గంట‌ల‌కు విశాఖ చేరుతుంది. తిరుగు ప్ర‌యాణంలో సాయంత్రం ఐదు 45 గంట‌ల‌కు విశాఖ‌లో బ‌య‌లు దేరి రాత్రి 10 గంట‌ల‌కు ప‌లాస చేరుతుంది. సింహాచ‌లం, కొత్త‌వ‌ల‌స‌,విజ‌య‌గ‌న‌రం, చీపురుప‌ల్లి, పొందూరు, శ్రీ‌కాకుళంల రోడ్,తిలారు, నౌప‌డ స్టేష‌న్ల మ‌ధ్య ఆగుతుంది.

ABOUT THE AUTHOR

...view details