ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమునిపట్నంలో 2 ప్రమాదాలు.. నలుగురికి గాయాలు - విశాఖ తాజా వార్తలు

భీమునిపట్నం పరిధిలో 2 వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒకరి తలకు బలమైన దెబ్బ తగలింది.

Two separate accidents
స్వీయప్రమాదాలు

By

Published : Oct 29, 2020, 2:55 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. భీమిలి నుంచి తగరపువలస వస్తున్న ఆటో... బ్యాంకుకాలనీ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఆటోడ్రైవర్ తో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

తగరపువలస జాతీయ రహదారి గోస్తనీ బ్రిడ్జి సమీపంలో ఓ మలుపు వద్ద డివైడర్ ను బైకు ఢీకొన్న ఘటనలో మరగడ అప్పలరెడ్డి అనే వ్యక్తికి తలపై తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరిన అతను.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details