ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. పది మందికి స్వల్ప గాయాలు - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ మార్గంలో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

two rtc buses collided at paderu agency
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

By

Published : Jan 18, 2021, 5:16 PM IST

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పెదబయలు మండలం చుట్టుమెట్ట తోటల మలుపుల వద్ద ప్రమాదం జరిగింది. పాడేరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు.

ఫలితంగా ఈ మార్గంలో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకరమైన మలుపు వెడల్పు తక్కువగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details