విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కేఎన్‌ఆర్ పేట హైవేపై ప్రమాదం జరిగింది. హైవేపై నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పైనుంచి పడిపోయిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
accident : హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ జిల్లా కేఎన్‌ఆర్ పేట హైవేపై ప్రమాదం జరిగింది. నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి.
పరవాడలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న దుర్గాప్రసాద్, సతీశ్‌లు షాపింగ్ చేయడానికి మరో స్నేహితుడు ఏలియాతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తూ నడిచి వెళ్తున్న కనకరాజును ఢీ కొట్టారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, సతీశ్‌లు మృతి చెందగా.. ఏలియా, కనకరాజులకు గాయాలయ్యయి. మరణించిన సతీశ్.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంగి గ్రామం కాగా, దుర్గాప్రసాద్ .. పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :accident : బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు మృతి