Two persons died in butchirajupalem accident: విశాఖపట్నం జిల్లా బుచ్చిరాజుపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రెండు వేర్వేరు బైకులను ఓ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బుచ్చిరాజుపాలెం గ్రామానికి చెందినపురెడ్డి మురళీ కృష్ణ(33).. కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సాగర్ నగర్ పరిధి గొల్లవారిపాలేనికి చెందిన వెంకట కృష్ణ మోహన్ (58) రైల్వేలో లోకోషెడ్ విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా బుచ్చిరాజుపాలెం సమీపంలో గంగవరం పోర్టు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం - విశాఖపట్నం జిల్లా బుచ్చిరాజుపాలెంలో రోడ్డు ప్రమాదం
Butchirajupalem accident: రెండు ద్విచక్రవాహనాలను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా బుచ్చిరాజుపాలెం వద్ద జరిగింది.
Butchirajupalem accident
Last Updated : Jul 7, 2022, 8:00 PM IST