ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైళ్లలో అక్రమంగా మద్యం రవాణా.. ఇద్దరు అరెస్టు - smuggling liquor on trains latest news

రైళ్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

smuggling liquor on trains
రైళ్లలో అక్రమంగా మద్యం రవాణా

By

Published : Jul 17, 2020, 10:58 PM IST

రైళ్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గవర్నమెంట్ రైల్వే పొలీస్(జీఆర్పీ)లు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన ఏపీ ఎక్స్ ప్రెస్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పట్నాన వెంకటేష్ అనే వ్యక్తి 20 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు. అలాగే అదే రైలులో విశాఖ జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన చల్లా అజయ్ కుమార్ 17 మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి బ్యాగులు తనిఖీ చేయగా మొత్తం 30 మద్యం బాటిళ్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ డీఎస్పీ ఆర్​. శ్రీనివాసరావు తెలిపారు. రైళ్లలో అక్రమంగా మద్యం, ఇతర చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details