విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్లపూడికి చెందిన ప్రగడ గోవిందరాజులు, కణతి గ్రామానికి చెందిన దుగ్గపులోషన్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టు వర్కర్లు గా పని చేస్తున్నారు. మద్యానికి బానిసైన ఇద్దరు.. కుటుంబాలను పట్టించుకోవడం మానేసి కలిసి తిరుగుతున్నారు. అయితే సోమవారం రాత్రి మద్యం సేవించి పడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలు దాటినా ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో స్థానికులు ఇంట్లో వెళ్లి చూడగా ఒకరు ఉరి వేసుకుని..మరొకరు కింద పడిపోయి ఉన్నారని వెల్లడించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఘటనాస్థలానికి సౌత్ ఏసీపీ రాజగోపాల్, సీఐ లక్ష్మి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఇద్దరు అనుమానాస్పద మృతి.. మద్యం మత్తులో ఉరేసుకున్నారా..?
విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకుని మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
మద్యం మత్తులో ఉరివేసుకోని ఇద్దరు మృతి!