అనకాపల్లిలోని శ్రీరామ్‌నగర్ చెందిన ఏడిద జగదీష్ చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో కలిసి చదువుకున్నాడు. అప్పట్లో పాఠశాల తీసుకున్న ఫొటోలు, పాదయాత్ర సమయంలో జగన్‌తో తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీ బోర్డు తయారు చేయించాడు. ఇదే ప్రాంతానికి చెందిన ముప్పిడి శ్రీను, జగదీష్ ఇద్దరు కలిసి మేడపై ఆ ఫ్లెక్సీ కడుతుండగా ఇంటికి ఎదురుగా ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వారి మృతితో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.
ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి - సీఎం ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు వ్యక్తులు మృతి
ముఖ్యమంత్రి జగన్ చిత్రాలతో రూపోందించిన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.
![ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి Two people died while arranging CM jagan Flexi in anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6229363-464-6229363-1582859868353.jpg)
ఫ్లెక్సీ
సీఎం ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు వ్యక్తులు మృతి