విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. యస్. రాయవరం మండలంలోని ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్ట్‌లో పడి ఒక కార్మికుడు మృతి చెందాడు.
పాయకరావుపేట- నర్సీపట్నం రహదారి కూడలిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జరిగిన రెండు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.