ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం - two people died in road accident

విశాఖ జిల్లా అరకులోయ బట్టివలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two people died in a road accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

By

Published : May 5, 2021, 4:26 PM IST

విశాఖ జిల్లా అరకులోయ మండలం మాదల పంచాయతీ బట్టివలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అరకు వేలి నుంచి గత్తపడుకు ప్రయాణిస్తున్న సమయంలో వారి ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నందివలసకు చెందిన రాజు, గత్తపడు గ్రామానికి చెందిన లక్ష్మణరావులు మృతి చెందారు.

అరకు లోయ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మార్గంలో గతంలోనూ అనేక మంది ప్రమాదవశాత్తు మరణించినప్పటికీ.. అధికారులు హెచ్చరిక బోర్డులు, స్పీడ్​ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయడంలేదని స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు. ఇకనైనా వీటిపై శ్రద్ధచూపి విలువైన ప్రాణాలు కాపాడాలని వారు అభ్యర్థిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details