ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్జికల్ స్పిరిట్ ఘటనలో మరో ఇద్దరు మృతి - two more died in surgical spirit incidentin vishaka

విశాఖ జిల్లా కశింకోట సర్జికల్ స్పిరిట్ ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ముగ్గురు మృతి చెందగా...విశాఖ కేజీహెచ్​లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు సోమవారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5 కి పెరిగింది.

సర్జికల్ స్పిరిట్ ఘటనలో మరో ఇద్దరు మృతి
సర్జికల్ స్పిరిట్ ఘటనలో మరో ఇద్దరు మృతి

By

Published : Jun 1, 2020, 9:04 AM IST

విశాఖ జిల్లా కశింకోటలో సర్జికల్ స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ముగ్గురు మృతి చెందగా...విశాఖ కేజీహెచ్​లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు సోమవారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5 కి పెరిగింది. కశింకోటకి చెందిన మృతులు...అధిక మత్తుకోసం సర్జికల్ స్పిరిట్ తాగినట్లు పోలీసులు నిర్ధరించారు.

ఈ ఘటనలో ఆనంద్, నూక రాజు, అప్పారావు ఆదివారం మృతి చెందగా.. మాణిక్యం, దొరబాబులు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పరవాడ మండలంలోని ఒక కంపెనీ నుంచి సర్జికల్ స్పిరిట్ తెచ్చి తాగినట్లు పోలీసులు విచారణలో తేలింది. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు అనకాపల్లి గ్రామీణ సీఐ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details