ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

harassment: వివాహితపై లైంగిక వేధింపులు.. ఇద్దరిపై కేసు - ap news

harassment: విశాఖ జిల్లాలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాహితపై లైంగిక వేధింపులు
వివాహితపై లైంగిక వేధింపులు

By

Published : Dec 2, 2021, 4:45 PM IST

harassment: ఇద్దరు వ్యక్తులు ఓ వివాహితను లైంగికంగా వేధించిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పది రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

గంటా వీరబాబు, పంది దుర్గాప్రసాద్ (హరిబాబు) అనే ఇద్దరు వ్యక్తులు గత నెల 21న బహిర్భూమికి వెళ్లిన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒక వ్యక్తి తనను బలవంతం చేసేందుకు ప్రయత్నించగా.. మరో వ్యక్తి వీడియోలో చిత్రీకరించాడని బాధిత మహిళ వాపోయింది. ఎలాగోలా వారిని తప్పించుకుని ఇంటికి చేరుకున్నానని తెలిపింది.

అయితే.. అప్పటి నుంచి వారిరువురూ కామ వాంఛ తీర్చాలని పదేపదే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఆ వీడియోను చూపిస్తానని పదేపదే వేధిస్తుండడంతో జరిగిన విషయాన్ని తన భర్త, అత్తమామలకు తెలియజేసిన అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

జయహో అఖండ... పూనకాలతో ఊగిపోతున్న థియేటర్లు!

ABOUT THE AUTHOR

...view details