ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

maoist : ఒడిశా డీజీపీ ఎదుట ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు - odisha DGP abhay

ఏవోబీలోని(AOB) ఇద్ద‌రు కీల‌క మావోయిస్టు నేత‌లు(Maoist leaders).. ఒడిశాలోని మ‌ల్క‌న్‌గిరి(malkangiri in odisha)లో ఆ రాష్ట్ర డీజీపీ అభ‌య్(odisha DGP abhay) ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒకరు మావోయిస్టు ఏరియా క‌మిటీ నాయకురాలు స‌బిత‌(sabitha) కాగా... మ‌రొక‌రు మావోయిస్టు పార్టీ స‌భ్యుడు రాయథర్(raydhar) గా పోలీసులు తెలిపారు.

జనజీవనస్రవంతి లో చేరిన ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు
జనజీవనస్రవంతి లో చేరిన ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు

By

Published : Jul 18, 2021, 9:17 PM IST

ఆదివారం ఏవోబీలో పర్యటించడానికి వచ్చిన ఒడిశా డీజీపీ అభ‌య్ ఎదుట మావోయిస్టు ఏరియా క‌మిటీ నాయకురాలు స‌బిత‌(sabitha), మావోయిస్టు పార్టీ స‌భ్యుడు రాయథర్(raydhar) లు లొంగిపోయారు. మహిళా మావోయిస్టు స‌బిత పేరు మీద రూ.రెండు ల‌క్ష‌లు రివార్డు ఉండ‌గా.. రాయథర్ పేరు మీద రూ. ల‌క్ష రివార్డు ఉంది. చాలా కాలంగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వీరు.. సంస్థలో వచ్చిన మార్పులతో మనస్తాపానికి గురై జ‌న‌జీనస్ర‌వంతిలో క‌ల‌వాల‌ని నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా మావోయిస్టులపై కరోనా ప్రభావం చూపడం కూడా దీనికి కారణమైంది. దీంతో వీరిరువురూ ఒడిశా డీజీపీ అభయ్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా.. ఏవోబీలో ఉన్న మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో చేరాలని, అలా వచ్చే వారికి పోలీసుశాఖ నుంచి పూర్తి స‌హ‌కారం ఉంటుందని ఒడిశా డీజీపీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details