ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎల్​జీ గ్యాస్ ప్రభావంతో ఇద్దరు లోకో పైలట్లకు అస్వస్థత - గోపాలపట్నం వార్తలు

విశాఖలో ఎల్​జీ గ్యాస్ ప్రభావంతో గోపాలపట్నంలో ఇద్దరు లోకో పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. రైల్వే ఆసుపత్రిలో చికిత్స అనంతరం వారి పరిస్థితి మెరుగైంది.

Two loco pilots ill with LG gas impact
ఎల్​జీ గ్యాస్ ప్రభావంతో ఇద్దరు లోకో పైలట్లకు అస్వస్థత

By

Published : May 10, 2020, 7:58 PM IST

విశాఖలో ఎల్జీ గ్యాస్​ ప్రభావంతో గోపాలపట్నంలో ఇద్దరు లోకో పైలట్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. సిగ్నల్‌ లేక తెల్లవారుజామున 2.30 గంటలకు 45 నిమిషాలపాటు గూడ్స్‌ నిలిచిపోయింది. ఎక్కువ సేపు అక్కడి గాలి పీల్చడం వల్ల ఇద్దరు లోకోపైలట్లు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత వారి పరిస్థితి మెరుగైంది.

కాగా ఎల్‌జీ గ్యాస్ ప్రభావంతో ఇప్పటివరకు ఐదుగురు లోకోపైలట్లు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం లోకోపైలట్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖ పరిధిలో లోకోపైలట్ల విధులను రైల్వేశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

ABOUT THE AUTHOR

...view details